
మాఊరి గురించి ఇప్పటికే ఊదరగొట్టి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను.
ఈసారి కూడా తప్పడం లేదు.
మా ఊరు అంత అందమైనది ఎం కాకున్నా నాకిష్టం.
చూడాలి ఊరిని
నేను మొదటిసారి (అదే చివరి సారి)సిగరెట్ తాగి నాన్నకి దొరికిన మా క్రికెట్ గ్రౌండ్ ని చూడాలి.
ఎప్పుడూ వినాయకుడిని పెట్టె చింతచెట్టు కలలో వచ్చింది దాన్ని చూడాలి.
మేము ఎప్పుడూ కూర్చునే గోడ మల్లి గుర్తొస్తుంది.
ఎప్పుడూ దొంగతనంగా క్రికెట్ ఆడే స్కూల్ గ్రౌండ్ చూడాలనిపిస్తుంది.
పొద్దున్న లేస్తే పేపర్ కొరకు కొట్టుకుకే రచ్చబండ(గడ్డమీద) ని చూడాలి
నేను యు.కే వచ్చాక కట్టిన గుడిని(ఇప్పటి వరకు నేను చూడంది) చూడాలి.
పెళ్లి కుదిరిన చెల్లిని
పెళ్ళైన వదిన ని
వీటన్నికంటే ముందు అమ్మని,నాన్నని,అక్కని,బావని,అల్లుళ్ళని,చేల్లెల్లని,ఫ్రెండ్స్ ని చూడాలని వుంది
ఎందుకంటే ఇవన్ని చూడక అక్షరాల రెండున్నరేళ్ళు.
ఆ చూసే రోజు ఎంతో దూరం లో లేదు.
ఇంకొన్ని గంటల్లో అన్నీ చూస్తా.
తలుచుకుంటే అంత నిజమేనా అనిపిస్తుంది.
కాకపోతే ఒక్కటే బాధ.
తెలంగాణా ఉద్యమం వాళ్ళ వరంగల్ పరిస్థితి బాలేదట.
అంత బాగుపడి నేను ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటూ.
నేను వెళ్ళాక నాకు ఎదురయ్యే సంఘటనలు,అనుభవాలు ఇంకో టపాలో త్వరలోనే రాస్తా..


జన్మభూమికి స్వాగతం.. సెలవుల్ని చక్కగా ఎంజాయ్ చేయండి..
ReplyDeleteమీరు ఊరు వెళ్ళి మళ్ళి ఎన్నో మాటలు మూటలు కట్టి...తె౦డి..మేము మీరు ఒక్కొక్కటిగా విప్పి చెప్పుతు౦టే మేము వి౦టా౦.. మీ ఊరు మట్టి వాసనలో మా మట్టి వనసలు వెదుకు౦టూ......
ReplyDeletei wish you happy holiday..