Sunday, 30 August 2009

పట్టపగలే చుక్కల్లో చంద్రుడు


పగలే చంద్రుడు అబ్బా ఎంతమంచి వర్ణన .నాకు మాత్రం దడ పుట్టించిన వర్ణన.
ఈ సోదేంటి అనుకుంటున్నారా .అసలు విషయంలోకి దూకుతున్న.

ఎప్పటిలాగే సంక్రాంతి పండగ వచ్చింది.అక్క ,అక్క వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చారు. సరదాగా సంక్రాంతి జరిగింది.ఇక మరుసటి రోజు సాయంత్రం అక్క ని వాళ్ళింట్లో (కరీంనగర్)లో దింపి నేను హైదరాబాద్ కి వెళ్ళాలి. ఇక్కడివరకి అంత సవ్యంగానే వుంది.కాని ఈ రెండు పనుల కంటే ముందు మా ఆచారం ఒకటి నిర్వర్తించాల్సి వచ్చింది.అదే సంక్రాంతి మరునాడు ఫ్రెండ్స్ తో కలిసి సినిమా కి వెళ్ళడం. ఒక్కడు మూవీ లో మహేష్ బాబు లాగ ఒక పెద్ద ప్లాన్ వేసాము నేను మా ఫ్రెండ్స్. అదేంటంటే మాట్నీషో సాయంకాలం ఐదింటికి అయిపోతుంది.మా అక్క వాళ్ళ ట్రైన్ ఆరింటికి. మేము ధియేటర్ నుండి డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి వస్తాము మీరు అక్కడ వెయిట్ చేయండి అని ఇంట్లో కస్టపడి మా నాన్నకి ఈ విషయం తెలియకుండా మా అక్క ని ఒప్పించి సినిమా కి బయలుదేరాము. మమూలుగా మేము పది మంది ఫ్రెండ్స్ సినిమా కి పోయేవాల్లము. ఈ సారి ఆ సంఖ్య ముప్పై కి పెరిగింది. ధియేటర్ లో ఒక రో అంత మాకే కేటాయించారు. అది చుక్కల్లో చంద్రుడు మూవీ. మూవీ లేట్ చేయకుండా కరెక్ట్ టైం కి వేసాడు ధియేటర్ వాడు. అబ్బా అంత చక్కగా అన్ని జరిగిపోతున్నాయి అనుకుని రిలాక్ష్ అవుతున్నా.
కరెక్ట్ గా అప్పుడు స్టార్ట్ చేసాడు నా పక్కవాడు అరుపులు. నాకే వాడి అరుపులు దరిద్రంగా వినపడుతున్నాయి. ఇక నా వెనక కూర్చున్న ఆడవాళ్ళ సంగతి వర్ణనాతీతం . అంతలోనే మేనేజర్ రావడం గోల చేయకండి అనడం.వెనక ఎస్పీ వాళ్ళ ఫ్యామిలీ మూవీ చూస్తున్నారు అనడం. నా కుడికన్ను అధరడం. మా వాడు సిటీ కి ఎంతో మంది ఎస్పీ లు వస్తారు పోతారు కాని చంటి గాడు లోకల్ అనడం అన్ని నాకు తెలియకుండా జరిగిపోయాయి. ఎస్పీ అయితే ఫ్రీ గా చూస్తారు మేము ముప్పై రూపాయలు పెట్టి టికెట్ కొన్నాము అని మా వాడు మల్లి వెంటనే అనడం .మల్లి గోల స్టార్ట్ చేయడం అన్ని అయిపోయాయి.నాది ప్రేక్షక పాత్ర అయిపోయింది. ఇదంతా కేవలం సినిమా స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల్లోనే.
అంతలోనే ఇద్దరు దిట్టంగా వున్నా గార్డ్స్ రావడం వాడికి బడిత పూజ చేయడం అయ్యాయి.అది చూడలేక నేను సారీ సర్.మల్లి రిపీట్ కాదు అనడం .వాణ్ని కాదు రా.వీణ్ణి చితక్కొట్టండి అని వాళ్ళు అనడం. నాకు రెండు దెబ్బలు పడటం.మా ముప్పై మంది ఆ ఇద్దరినీ చితక్కోట్టడం అన్ని జరిగిన కొద్దిసేపటికే తెలిసింది మా వాళ్ళు కొట్టింది యునిఫోరం లో లేని పోలీసులని అని. ఇక అసలు సినిమా అప్పుడు స్టార్ట్ అయింది .రక్షక్ జీప్ రావడం మమ్మల్ని అందులో వేయడం అన్ని నిమిషాల్లో జరిగిపోయాయి.
అక్కడ ఏమి జరిగి వుంటుందో మీ ఊహ కి వదిలేస్తున్న.
చివరికి నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐదు గంటలు అవ్వనే అయింది.గుండెల్లో ఐదు గంటలు మోగాయి. ఎలాగోలాగ వాళ్ళని బ్రతిమిలాడి కొంత అమ్యమ్యాలు సమర్పించుకుని నేనోక్కన్ని బయటపడి ట్రైన్ టైం కి రైల్వే స్టేషన్ చేరుకుని హమ్మయ్య అనేలోపు నాన్న ని చూసి పిడుగు పడింది.
ఎందుకు లేట్ అయింది నాన్న ప్రశ్న
మూవీ ప్రింట్ లేట్ అయింది నా జవాబు.
నిజం చెప్పు అని గద్దింపు.
అదే నిజం అని నా జవాబు .
నాకు అంత తెలుసు అనేసరికి పిడుగు నాలో,
ట్రైన్ వస్తే బావుండు అనుకుంటుండగా ట్రైన్ గంట లేట్ అని వార్త.మల్లి పిడుగు.
ఇక ఆ గంట నరకం నా జన్మ లో మల్లి ఇప్పటివరకి చూడలేదు.
గంటసేపు వచ్చి పోయే ప్రయానికులకి నేను చేసిన ఘనకార్యం చెప్పుకుంటూ ,నా గురించి సుప్రభాతం చదువుతుంటే అబ్బా చెవులకి ఎంత వినసొంపో.
అలా నేను పట్టపగలే చుక్కల్లో చంద్రుణ్ణి చూసాను.
ఇది జరిగి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయిన ఇప్పటికి మమ్మల్ని చుక్కల్లో చంద్రులు అనే పిలుస్తున్నారు.
ఒక్కసారిగా కోపం వస్తుంది.కాని ఏంచేస్తాం .ఆది లో ntr లాగ కంట్రోల్ కంట్రోల్ అనుకోవడం తప్ప.
( అరిచి నన్ను ఇరికించిన ఘనున్ని పై చిత్రంలో చూడొచ్చు)

ఆ షాక్ తో ఇంతవరకి మల్లి సంక్రాంతి సినిమాలు బంద్ . సిద్దార్థ సినిమాలు బంద్.
అంత హిట్ అయిన బొమ్మరిల్లు ఇంతవరకి చూడలేదు నేను .

5 comments:

  1. అయ్యో పాపం..ఎంత కష్టపడ్డారండి!!

    ReplyDelete
  2. హ హ్హా .....సారీ ....అంత కష్టపడ్డారు కాబట్టే ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు ....
    మీ ఫ్రెండ్ కి సాహసం సేయరా డింభకా రాజకుమారి దొరుకుతుందని ఎవరో చెప్పి ఉంటారు ....మీరూ అతన్ని ఫాలో ఐపోండి మరి :) :)

    ReplyDelete
  3. అప్పుడు బాధ అనిపించింది.కాని అవన్నీ ఇప్పుడు స్వీట్ మెమోరీస్ కదండి

    ReplyDelete
  4. సంక్రాంతి సినిమాలు బంద్ చేయడం మాత్రం బాగాలేదండి.. అస్సలు సినిమా చూడకుండా సంక్రాంతి పండుగ ఏమిటి చెప్పండి? ఫోటో పెట్టకుండా ఉంటే మీ ఫ్రెండ్ ని ఏ రవితేజ లాగో ఊహించుకునే వాడిని :-)

    ReplyDelete
  5. పరిమళం గారు@తొలిసారి నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలు
    మురళి గారు@ఇండియా ఈ సంక్రాంతి కి వెళ్తున్న మల్లి స్టార్ట్ చేస్తా సినిమాలు

    ReplyDelete