
బౌలింగ్ వెయ్యడానికి పరుగెత్తుతున్న నాకు ఎదురుగా నా కన్నా వేగంగా పరుగెత్తుకుంటూ వస్తున్న నాగరాజు .వాడి అరుపుల్లో ఆత్రుత,నాలో భయం ఎందుకంటే వాడు అంత ఆత్రంగా పిలిచేది నన్నే మరీ.
వెంటనే బాల్ అక్కడ పడేసి ఏంటి అని అడిగా.
వాడి చేతిలో ఒక లెటర్ .
అది నాకు ఇచ్చాక వాడికి నోట్లో మాటలు బంద్.
ఆ లెటర్ తెరిచా మెల్లిగా.అందులో
"పూజ కోసం పువ్వు
నాకోసం నువ్వు
ఒక్కసారి నవ్వు
అదే మన లవ్వు"
నాకు బయమేసింది వీన్ని అమ్మాయిలు అందరు రెజెక్ట్ చేస్తే కొంపదీసి నన్ను లవ్ చేస్తున్నాడా అని.
ఆ షాక్ నుండి తేరుకొని ఏంట్రా ఇదంతా అంటే
సుజాత వారం నుండి వెంటబడితే ఇవ్వాళా ఈ లెటర్ ఇచ్చింది అని దీనికి కౌంటర్ గా ఒక మంచి కవిత రాయి అని అది ఒక గంట లో రాయి అని ఆర్డర్.
మనమేదో వేటూరో,ఆత్రేయో అనుకున్నాడు వాడు.
వాడు అలా అనుకోవడం లో ఎం తప్పు లేదు ఎందుకంటే తెలుగు లో వాడికంటే నేను కొంచం బెటర్.
అంటే ఇంగ్లీష్ లో వాడు బెటర్ అనుకునేరు.ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా రాదూ వాడికి.అది వేరే విషయం.
వాడి కవిత కి కౌంటర్ గా ఒక తవిక(మీకు అలా అనిపివ్వకపోతే నా తప్పేం లేదు ఎందుకంటే నాకు అలా అనిపివ్వలేదు) రాసేసా .అదే
"పాలసాగర మథనఫలం మధురసుధ
నీ మదిసాగర మథనఫలం ఈ ప్రేమకథ
అందుకే ఇది కాకూడదు కథ "
అని ఏదేదో రాసేసా
వీడు పరుగెత్తుకుంటూ అక్కడ పోయి ఆమెకి ఇవ్వడం
ఆమెకి అర్ధం కాక వాణ్ని తిట్టడం
వాడు నన్ను తెలుగు కూడా రాకుండా ఎందుకు వుంటారు అనడం అన్ని అయిపోయాయి.
ఎందుకురా అలా అన్నావు ఒక్కసారే అంటే ఈ పాలు పెరుగు ఏంది .సాగర్ ఎవడు సుధ ఎవరు అని అడిగిందట వీన్ని.అస్సలు ఎం చేస్తుందిరా అంటే పదవ క్లాసు తెలుగు లో ఫెయిల్ అయ్యి మల్లి రాయడానికి చదువుతుంది అని చావుకబురు చల్లగా చెప్పాడు.
ఆవేశం లో ఇంకో తవిక వాళ్ళ స్టైల్ లో రాసేసా.అదే
"పెళ్లి కి బాజా
నీళ్ళకి కూజా
నేనే నీ రాజా
నీకే ఈ తాజా రోజా "
అబ్బ అది ఆమె కి తెగ నచ్చేసి వాళ్ళ ప్రేమ పి.టి.ఉష రేంజ్ లో పరుగులు తీసింది.
మొత్తానికి వాళ్ళకి పెళ్లి కూడా అయింది.
వాడికి ఇద్దరు పిల్లలు.
ఆమె గురించి తెలియదు.
అదేంటి అనుకుంటున్నారా వాడికి వాడి భార్యతో.
ఆమె కి ఆమె భర్తతో పెళ్లి అయింది.
ఇక మా ఇంటి పక్కన అమ్మాయిలతో నాకు కొంచం చనువు ఎక్కువగానే వుండేది.
అందులో ఇద్దరు అమ్మాయిలని ప్రేమిస్తున్నమంటూ హెల్ప్ చెయ్యాలని మా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక చిన్న బిల్ పాస్ చేసారు.
అప్పట్లో సినిమాల ప్రభావం వాళ్ళ సరే అని ఒప్పుకొని ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్లి మా ఫ్రెండ్స్ ఇద్దరు మిమ్మల్ని లవ్ చేస్తున్నారట దానికి మీరేం అంటారు అన్నట్టు గా ఒక చిన్న లుక్కేసా.
దానికి వాళ్ళు చెప్పు తెగుద్ది అనేసరికి గుండె జారినంత పని అయింది.
నిన్ను కాదు ఆ ఇద్దరు వెధవలకి అనగానే హమ్మయ్య అనుకోని ఆ విషయం మా ఇద్దరు ఫ్రెండ్స్కి కొంచం మసాల యాడ్ చేసి మరీ చెప్పేసరికి కారం ఎక్కువై కళ్ళ వెంబడి నీళ్ళు కారాయి పాపం .
మన మధ్యవర్తిత్వం ఎలాగోలాగ మా ఇంట్లో తెలిసిపోయింది ఇక మల్లి సుప్రభాతం క్రూ.
ఇలా మనం మధ్యవర్తిత్వం చేసిన కథలన్నీ గంగ లో కలిసిపోయాయి.కాని నా ప్రమేయం లేకుండా జరిగిన ఒక ప్రేమకథ పెళ్లి వరకి వచ్చింది. దాని విశేషాలు మల్లి ఇంకోసారి చెప్తా


me way of writing chala bagundhi.
ReplyDeleteచాలా బాగా రాసారు :) keep iT up
ReplyDeleteబాగున్నాయి మీ ప్రేమ రాయబారాలు..ఇంతవరకేనా లేక పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం కూడా ఎత్తారా??
ReplyDeleteవర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే బాగుంటుందండి..ఆలోచించండి.
ReplyDeleteఅవునా ?
ReplyDeleteఅయినా మీకిదేం పని? చక్కగా ఓ పిల్లని చూసి పెళ్ళి చేసుకోక..ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో దూరడం.?
గుడ్..గుడ్... 'పదో తరగతి తెలుగు పేపర్ ఫెయిల్..' నవ్వి నవ్వి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయండి.. చాలా చాలా బాగుంది, చివర్లో ట్విస్ట్ తప్ప...
ReplyDeleteమహిపాల్ గారు @థాంక్స్
ReplyDeleteప్రణీత స్వాతి గారు@పెళ్ళిళ్ళ పేరయ్య విశేషాలు మల్లి చెపుతా
sreenika gaaru@మీరు మంచి పిల్ల వుంటే చెప్పండి .
మురళి గారు @ధన్యవాదాలు నచ్చినందుకు
నేస్తంగారు@ధన్యవాదాలు నచ్చినందుకు
ReplyDeletemee saili adbhutham...
ReplyDeleteilaane continue ayiponDi....
cartheek@
ReplyDeletethanks 4 your compliments
బాగుంది టపా....
ReplyDeleteశేఖర్ పెద్దగోపుగారు@ధన్యవాదాలు నచ్చినందుకు
ReplyDelete